ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై ఈ నెంబర్ల నుంచే కాల్స్.. లిస్ట్ ఇదిగోండి!
Sat Jun 07, 2025 16:27 Technology
దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలూ ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) తమ వినియోగదారుల భద్రత కోసం కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా, +91-1600తో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ విషయంలో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవి సురక్షితమైనవేనని స్పష్టం చేసింది. ఈ నంబర్లను లావాదేవీలు, సేవలకు సంబంధించిన సమాచారం అందించడానికే ఉపయోగిస్తామని బ్యాంకు తెలియజేసింది. పెరిగిపోతున్న సైబర్ మోసాల బారిన పడకుండా వినియోగదారులను కాపాడేందుకు ఎస్బీఐ ఈ ప్రకటన చేసింది. "+91-1600 తో మొదలయ్యే నంబర్ నుంచి మీకు కాల్ వస్తే, అది కచ్చితంగా నిజమైన, చట్టబద్ధమైన కాల్ అని నిశ్చింతగా ఉండండి. ఈ నంబర్లను కస్టమర్లకు లావాదేవీలు, సేవలకు సంబంధించిన కాల్స్ చేయడానికి ఉపయోగిస్తాము. దీనివల్ల మీరు స్పామ్, మోసపూరిత కాల్స్ నుంచి నిజమైన కాల్స్‌ను గుర్తించవచ్చు.
ఇది కూడా చదవండి: చాలా ఎక్కువ ధరకే 5జీ మొబైల్.. 5000mAh బ్యాటరీ.. 50MP కెమెరా.! వీడియో కాల్స్ కోసం..
అయాచిత కాల్స్‌తో మాట్లాడకండి, సైబర్ మోసాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి," అని ఎస్బీఐ తమ ఎక్స్ ఖాతాలో పేర్కొంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. 2025 జనవరి 17న ఆర్‌బీఐ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని బ్యాంకులు, నియంత్రిత సంస్థలు (ఆర్ఈఎస్) లావాదేవీలు లేదా సేవల నిమిత్తం కస్టమర్లకు కాల్ చేయడానికి '1600xx' సిరీస్‌తో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్లను మాత్రమే ఉపయోగించాలి. మార్కెటింగ్ లేదా ప్రచార కాల్స్ కోసం '140xx' నంబర్ సిరీస్‌ను మాత్రమే వాడాలని ఆర్‌బీఐ ఆదేశించింది. దీని ద్వారా వినియోగదారులు చట్టబద్ధమైన కాల్స్, మోసపూరిత కాల్స్ మధ్య తేడాను సులభంగా గుర్తించగలుగుతారు. కింద పేర్కొన్న నమూనాను అనుసరించని గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే అనుమానాస్పద లేదా అయాచిత కాల్స్‌తో ఎలాంటి సమాచారం పంచుకోవద్దని ఎస్బీఐ వినియోగదారులకు సూచించింది.
ఎస్‌బీఐ అధికారిక నంబర్లు:
* 1600-01-8000
* 1600-01-8003
* 1600-01-8006
* 1600-11-7012
* 1600-11-7015
* 1600-01-8001
* 1600-01-8004
* 1600-01-8007
* 1600-11-7013
* 1600-00-1351
* 1600-01-8002
* 1600-01-8005
* 1600-11-7011
* 1600-01-7014
* 1600-10-0021
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!
రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #StateBankofIndia #SBI #SBIfraud #cybercrime #digitaltransactions #RBIguidelines #1600number #seriesfinancial #securitycustomer #awareness #onlinesafety
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.